- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ షో చంద్రబాబుకు మైలేజా? మైనస్సా?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతున్న తరుణంలో నందమూరి నటసింహం బాలయ్య 'ఆహా'లో మరోసారి సందడి చేయబోతున్నారు. ఇప్పటికే తనదైన పంచు డైలాగ్స్, ఎంటర్ టైన్ మెంట్ తోపాటు ఎమోషన్స్ ను రంగరించి అన్ స్టాపబుల్ షోను నాన్ స్టాప్ గా పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా సీజన్-2తో మరోసారి సందడి చేయబోతున్నారు బాలయ్య. మొదటి విడతలో తికమకపెట్టే ప్రశ్నలతో, సరదాలతో సినీ స్టార్స్ తో సందడి చేయించిన బాలయ్య రెండో సీజన్ ను మాత్రం టీడీపీ అధినేత, తన బావ, మాజీ సీఎం చంద్రబాబుతో స్టార్ట్ చేయబోతుండటం సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా అందులో ఉన్న మేటర్ తో ఫ్యాన్స్, పొలిటీషియన్స్ లోనూ ఈ షోపై ఉత్సుకత పెరిగింది. బాలయ్య షోకు గెస్ట్ గా వచ్చిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో 1995లో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభంపై స్పందించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు మోయాల్సినంత అపవాదు మోస్తూనే ఉన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ అంశంలో ప్రత్యర్థులు బాబును టార్గెట్ చేయాల్సినంతగా చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ ఇష్యూను తెరపైకి తేవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటన్నదే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ ప్రోమో చూశాక ఈ ఎపిసోడ్ పై జూనియర్ ఎన్టీఆర్ పేరును నెటిజన్లు ప్రస్తావిస్తుండటంతో చర్చను మరింత హాట్ గా మారుస్తోంది.
ఆ మరక వదిలినట్టేనా?:
సీనియర్ ఎన్టీఆర్ నుండి పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడంపై చంద్రబాబుపై అనేక ఏళ్లుగా విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబును స్వయంగా ఎన్టీఆరే విమర్శించిన వీడియోలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా బాబును రాజకీయంగా కార్నర్ చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా నాన్ స్టాప్ గా వస్తున్న ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ ను వేదికగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే తానొక్కడినే స్పందిస్తే సరితూగదనుకున్నారో ఏమో కానీ అసలు 1995లో ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని బాలయ్య నోటి వెంటే బాబు చెప్పించే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. 'మనం ఆరోజు తీసుకున్న నిర్ణయం తప్పా అని బాబు అడగ్గా.. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది బావా..' అంటూ బాలయ్య చెప్పిన మాటలు ప్రోమోలో ఉన్నాయి. తన లైఫ్ లో ఆయనొక ఆరాధ్య దైవం అంటూ బాబు చెప్పిన మాటలు కూడా ఎన్టీఆర్ ను ఉద్దేశించే అని తెలుస్తోంది. అయితే రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలను చవి చూసిన చంద్రబాబుకు 1995 మరక అలానే ఉండిపోయింది. 27 ఏళ్ల తర్వాత ఆయన ఇలా ఈ ఇష్యూలో అసలేం జరిగింది అనేది ఎన్టీఆర్ వారసుడు బాలయ్యతోపాటు తాను కలిసి చంద్రబాబు రివీల్ చేయబోతున్నారా? ఈ దెబ్బతో ఏపీ రాజకీయాల్లో ఏదైనా మార్పులు సంభవిస్తాయా అనేది ఆసక్తి రేపుతోంది.
తెరపైకి జూ. ఎన్టీఆర్ పేరు?:
ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా బాలయ్యతోపాటు నారా లోకేష్ సైతం సందడి చేశారు. సరదా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ రాజకీయ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నలను బాలయ్య సంధించడం ఆసక్తిగా మారింది. పోటీ చేసిన మొదటి సారే ఓటమి పాలయ్యారని నేరుగా ప్రశ్నించడం, గతంలో విదేశాల్లో యువతులతో స్విమ్మింగ్ పూల్ లో లోకేష్ దిగిన ఫొటోలను స్క్రీన్ పై ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఇక రాజశేఖర్ రెడ్డి తాను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో వైసీపీని కార్నర్ చేశారా అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీకి ఈసారి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇటీవలే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ వైఎస్సార్ పేరు ఖరారు చేశారు. అయితే ఈ ప్రోమో చూసిన వైసీపీ మద్దతు దారులు జూ. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హెల్త్ యూనివర్సిటీ విషయంలో వైఎస్సార్ ప్రజాదరణ కలిగిన నాయకుడు అని జూనియర్ ఎన్టీఆర్ చెబితే అతడి సినిమాలను బ్యాన్ చేస్తాం, లోకేషే మా నాయకుడు అని తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శించారని, ఇప్పుడు అదే టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్సార్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఈ షో అంతా నారా వారి కుటుంబం ప్రమోట్ చేయడానికే ఉందని టీడీపీ నుండి జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసే ప్రయత్నమే అని నెటిజన్లు విమర్శలు చేస్తుండటం గమనార్హం.
అన్ స్టాపబుల్ చంద్రబాబుకు మైలేజా? మైనస్సా?:
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ వేదికగా చంద్రబాబు చేసిన కామెంట్స్ ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చబోతున్నాయనేది ఆసక్తి పుట్టిస్తోంది. రాజకీయంగా చంద్రబాబుకు ఈ షో మేలు చేస్తుందా అనేది అందరి నోట వినిపిస్తున్న మాట. ఓ వైపు టీడీపీని జగన్ ఇరుకున పెట్టేలా ముఖ్యమంగా కుప్పం నుంచే టార్గెట్ మిషన్ ప్రారంభించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు ఈ ప్రోగ్రామ్ మంచి మైలేజ్ ఇస్తుందనే ఆశాభావం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇందులో ప్రస్తావించినట్లు ఎన్టీఆర్ విషయంలో రాంగ్ ట్రిగ్గర్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. దానితోపాటు హైదరాబాద్ అభివృద్ధి, సైబర్ టవర్ పై కూడా ఆసక్తికర రీతిలో స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని టీఆర్ఎస్ అనేకసార్లు విమర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ స్టాపబుల్ షో చంద్రబాబు, లోకేష్ పొలిటికల్ కెరీర్ కు మైలేజ్ ఇస్తుందా లేక మైనస్ అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.
ఇవి కూడా చదవండి: