కరోనా వచ్చింది.. సోనూసూద్ వచ్చాడు.. సాయం కావాలంటే నా ఓల్డ్ నెంబర్‌ను సంప్రదించండి

by Nagaya |   ( Updated:2022-12-23 13:03:09.0  )
కరోనా వచ్చింది.. సోనూసూద్ వచ్చాడు.. సాయం కావాలంటే నా ఓల్డ్ నెంబర్‌ను సంప్రదించండి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోను కరోనా వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సోనూసూద్ మళ్లీ ఓ ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. గతంలో కరోనా సమయంలో దేవుడిలా ప్రజలను ఆదుకున్న సోనూసూద్ మరోసారి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన భార్య సోనాలి సూద్‌తో కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించించేందుకు శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త కరోనా వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. "నంబర్ అబ్ భీ వహీ హై, జరూరత్ పడేగీ టు ఫోన్ జరుర్ కిజియేగా (నా నంబర్ ఇప్పటికీ అలాగే ఉంది. దయచేసి అవసరమైనప్పుడు కాల్ చేయండి)" అని తెలిపారు. తన పాత ఫోన్ నెంబర్ ఇంకా యాక్టివ్‌గా ఉందని అన్నారు. ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్నా.. తనను లేకపోతే తన టీమ్‌ను సంప్రదించాలని సూచించాడు. సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ALSO READ : మళ్లీ బీభత్సం సృష్టిస్తున్న కరోనా... రోజుకు 5 వేల మరణాలు!

Advertisement

Next Story