బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ రైతు బిడ్డ ఔట్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

by sudharani |
బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ రైతు బిడ్డ ఔట్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున
X

దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మూడు వారాలు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. ఇక హౌస్ మేట్స్ కూడా ఎవరికి ఎవరూ తక్కువ కాదు అన్నట్లుగా గేమ్స్‌ల్లో ఇరగదీస్తున్నారు. అయితే ఈ వీక్ నామినేషన్స్‌కు వస్తే.. పృథ్విరాజ్, సోనియా, ప్రేరణ, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అవుతారు. ఈ వారం ఎండింగ్‌కు కూడా వచ్చేసింది. ఓటింగ్ కూడా కంప్లీట్ అయింది.

దీంతో హౌస్‌లో ఉండేది ఎవరూ? ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేది ఎవరూ? అనే క్యూరియాసిటీ నెలకొంది బిగ్ బాస్ లవర్స్‌లో. అయితే.. తాజా సమాచారం మేరకు.. ఈ వారం ఓటింగ్ చూసుకుంటే.. సోనియాకు లీస్ట్ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. సోనియా ఎలిమేనేషన్‌పై బిగ్ బాస్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. ఇక నుంచి నిఖిల్, పృథ్వీ గేమ్ బాగా ఆడుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed