- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL ప్లేయర్లకు గుడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2025) సమీపిస్తోన్న వేళ బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. టోర్నీలో ఆడే ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజుల కోసం ఒక్కో ఫ్రాంఛైజీ రూ.12.60 కోట్లు కేటాయిస్తుందని పేర్కొన్నారు.
ఈ కొత్త విధానం వల్ల ఆటగాళ్లకు మరింత ఆదాయం సమకూరనుంది. ఒక ప్లేయర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే మ్యాచ్ ఫీజుల రూపంలో రూ.1.05 కోట్లు సంపాదించే అవకాశ ఉంది. ఇది కాకుండా ఇప్పటికే ఆటగాళ్లు ఫ్రాంఛైజీలతో ఏర్పరుచుకున్న ఒప్పందాల ద్వారా కూడా మరింత ఆర్జించే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ద్వారా యువ ఆటగాళ్లు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఇక, మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలనే దానిపై ఆదివారం జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.