నేను బరువు తగ్గితే ఆయన తట్టుకోలేకపోతున్నాడు : Sonam Kapoor

by sudharani |   ( Updated:2022-11-24 14:18:01.0  )
నేను బరువు తగ్గితే ఆయన తట్టుకోలేకపోతున్నాడు : Sonam Kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్, నటి సోనమ్ కపూర్ డెలివరీ తర్వాత కొద్దినెలలకే బరువు తగ్గడంపై ఓపెన్ అయింది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొ్న్న నటి.. ఈ సందర్భంగా ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొడుకు పుట్టిన 3 నెలలకే తాను బరువు తగ్గడం భర్త ఆనంద్ అహుజా మనసును దెబ్బతీసిందని పేర్కొంది. అయితే, కుమారుడి ఆలనాపాలనపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తన డైట్, ఫుడ్ తదితర అంశాలపై కాన్సంట్రేట్ చేయకపోవడం, ముఖ్యంగా బిడ్డకు పాలివ్వడం కూడా తన వెయిట్ లాస్‌కు కారణమని చెప్పింది. ఇక తల్లి కావడాన్ని కొత్తగా ఫీల్ అవుతున్నానన్న నటి.. తనకు స్ట్రెచ్‌ మార్క్స్ ఏర్పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది.

Alia Bhatt:ఈ శరీరంతో ఎప్పుడూ సంతోషంగా లేను .




Advertisement

Next Story