అతన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం అదే: Sonam Kapoor

by Prasanna |   ( Updated:2022-12-23 08:20:10.0  )
అతన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం అదే: Sonam Kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్..భర్త, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఉందంటోంది. 2018లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జోడి 2022 ఆగస్టు 20న తమ మొదటి బిడ్డను స్వాగతించారు. అయితే తాజాగా తన కూతురు, భర్త మధ్య అనుబంధం గురించి చెప్పిన నటి..ఒకరికొకరూ గొప్ప సమయాన్ని కేటాయించుకుంటారని, పిల్లల పెరుగుదల, మానసిక అభివృద్ధిని పెంపొందిచేందుకు ఆనంద్ తండ్రి పాత్రను గొప్పగా నిర్వర్తిస్తాడని తెలిపింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇంట్రెస్టింగ్ స్టోరీ పంచుకున్న సోనమ్..'నాన్నలు..మీరు మీ భార్య చేయి పట్టుకున్నప్పుడు లేదా ఆమె వెనుక భాగంలో మీ చేతిని సున్నితంగా ఉంచినప్పుడు మీ కుమార్తె గమనిస్తుందని గ్రహించాలి. మీరు మీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా కూతురు వింటుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విస్మరిస్తూ మీరు మీ ఫోన్‌ వైపు మాత్రమే చూస్తున్నపుడు కూడా ఆమె మిమ్మల్ని చూస్తుంది. మీరు చేసే ప్రతి పనిని ఆమె పరిశీలిస్తోంది. కాబట్టి ఆమెతో ఆటలాడేందుకు సమయాన్ని కేటాయించండి' అంటూ నెటిజన్లకు సూచించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అభిమానులు మురిసిపోతున్నారు.

Advertisement

Next Story