కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్.. సోషల్ మీడియా వేదికగా ఇన్సల్ట్ చేసిన ఫ్యామిలీ

by Sujitha Rachapalli |   ( Updated:2024-06-20 09:03:33.0  )
కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్.. సోషల్ మీడియా వేదికగా ఇన్సల్ట్ చేసిన ఫ్యామిలీ
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలపై నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఓ ఆడియో ఇన్విటేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా... ఫ్యామిలీ మాత్రం ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. కూతురి పెళ్లి గురించి మీడియాతో మాట్లాడిన తండ్రి శత్రుఘ్న సిన్హా.. ' నా కూతురి మ్యారేజ్ గురించి నాకే తెలియదు ' అన్నట్లు మాట్లాడాడు. ఈరోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు అంత గౌరవం ఇవ్వట్లేదని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఇక తాజాగా సోనాక్షి మదర్, బ్రదర్ ఇద్దరు కూడా ఆమెను ఇన్ స్టాగ్రాంలో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తుంది.

ఇదంతా చూస్తుంటే ఈ హీరోయిన్ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్లు అర్థం అవుతుందని అంటున్నారు నెటిజన్లు. దీంతో గతంలో సోనాక్షి తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఎప్పుడూ బలవంతం చేయలేదన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె చెప్పిన డేట్ కు పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో ఎక్కువైపోతుండటంతో.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడాన్ని తమ హీరోయిన్ కి జరిగిన అవమానంగా భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed