కమిట్మెంట్ అడిగి బలవంతం చేసేవారు.. సిరీయల్ నటి ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-02-20 08:04:07.0  )
కమిట్మెంట్ అడిగి బలవంతం చేసేవారు.. సిరీయల్ నటి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు ఇప్పటికీ ఎంతో తమ బాధను చెప్పుకుని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బుల్లితెరలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు చెబుతూ బ్రహ్మముడి సీరియల్ నటి నైనిషా రాయ్ తన అనుభవాలు వివరించి బాధపడింది. ‘‘ మా ఇంట్లో యాక్టర్ అవుతానంటే ఒప్పుకోలేదు. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపేశారు.

నటన మీద ఇష్టంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత తినడానికి తిండిలేక ఓ చోట డబ్బులు ఇస్తారని తెలిసి రక్తం డొనేట్ చేశాను. ఈ క్రమంలో ఆఫర్స్ కోసం కొంత మంది దగ్గరకు వెళ్తే.. అవకాశం ఇస్తే నాకేంటి? అని అడిగేవారు. మరికొందరు ఆఫర్ ఇచ్చాక కమిట్మెంట్ అడగడం స్టార్ట్ చేశారు. షూటింగ్ మొదలవుతుండగా నన్ను బలవంతం చేయడంతో కొట్టి తప్పించుకుని వచ్చేశాను.

ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నా కానీ నా తల్లిదండ్రులు ఆదరిస్తారో లేదో అని ఆలోచించి చనిపోవడం మంచిదని అనుకున్నాను. దీంతో పలుమార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. ఆ తర్వాత ధైర్యంతో ముందడుగు వేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం నైనిషా రాయ్, బ్రహ్మముడి, శ్రీమంతుడు, వంటలక్క వంటి సీరియల్స్‌లో నటిస్తుంది. అంతేకాకుండా పలు టీవీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Read More..

దానికి ఒప్పుకోకపోవడం వల్లే జబర్దస్త్ బ్యూటీ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా?

Advertisement

Next Story