జబర్దస్త్ సన్నాసులకు ఎమోషన్స్‌తో పనిలేదు.. మా హీరో బాధలపైనే జోకులు వేస్తారా.. అభిమానులు ఫైర్

by Dishafeatures3 |
జబర్దస్త్ సన్నాసులకు ఎమోషన్స్‌తో పనిలేదు.. మా హీరో బాధలపైనే జోకులు వేస్తారా.. అభిమానులు ఫైర్
X

దిశ, సినిమా : బిగ్ బాస్‌ షోతో బాగుపడిన అతికొద్ది మందిలో సోహెల్ ఒకడు. విన్నర్, రన్నర్ కాకుండానే విజేత కన్నా ఎక్కువ ప్రైజ్ మనీ కొట్టేసిన ఆయన.. చిరంజీవి ఇంటి బిర్యానీని రుచి చూసే అదృష్టాన్ని పొందాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు పొందిన సోహెల్.. అంతగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ప్రెస్ మీట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసి.. సినిమాలు తీస్తే ఎందుకు చూడరని ఏడ్చాడు. తన మూవీ రిలీజైన థియేటర్ ఖాళీగా ఉండటంతో బాధపడిపోతూ ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే ఈ ఇన్సిడెంట్‌ను జబర్దస్త్‌లో కామెడీ స్కిట్‌గా మలిచాడు బుల్లెట్ భాస్కర్. సోహెల్ బాధను ఫన్ చేసి పడేశాడు.

కాగా దీనిపై స్పందించిన సోహెల్.. ‘కామెడీ షోస్, మీమ్స్‌లో నా ఫీలింగ్స్ టార్గెట్ చేయడాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ నా లవ్డ్ వన్స్ కామ్‌గా ఉండమని చెప్పడం వల్లే ఊరుకుంటున్నా. లేదంటే నా రియాక్షన్ మామూలుగా ఉండదు’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో సోహెల్ బాధపడటాన్ని చూసిన అభిమానులు జబర్దస్ట్ ప్రోగ్రామ్‌ను తిట్టిపోస్తున్నారు. ‘జబర్దస్త్ సన్నాసులకు ఎమోషన్స్‌తో పనిలేదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల బాధలను స్కిట్ చేసుకోండి. మా హీరో జోలికి వస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed