తండ్రి లేకుండా జీవించడం అంత ఈజీ కాదు: సోహా అలీ ఖాన్

by srinivas |   ( Updated:2023-05-19 13:37:18.0  )
తండ్రి లేకుండా జీవించడం అంత ఈజీ కాదు: సోహా అలీ ఖాన్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సోహా అలీ ‌ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ‌ఖాన్ పటౌడీ 11వ వర్ధంతి సందర్భంగా కన్నీటి నివాళులర్పించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా 2011 సెప్టెంబర్ 22న ఈ దిగ్గజ క్రికెటర్‌ మరణించగా.. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న కుమార్తెలు సోహా, సబా అలీ‌ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు తండ్రి లేని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో వివరిస్తూ బాధపడిపోయింది సోహ. 'మా అమ్మ వచ్చి నాన్న ఇక లేరని చెప్పారు.

అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆమె ఏం చెబుతుందో అర్థం కాలేదు. కానీ, కాలక్రమంలో తండ్రి లేకుండా జీవిస్తున్నామని తెలుసుకున్నాం. నా నాన్న వాయిస్‌ని చాలా మిస్ అవుతున్నాం. మిస్ యూ అబ్బా' అంటూ నివాళులు అర్పించింది. దీనిపై స్పందిస్తున్న మన్సూర్ అభిమానులు.. 'ఎంత మనోహరమైన వాయిస్.. అతని ఇంటర్వ్యూలను ఇప్పుడు యూట్యూబ్‌లో శోధిస్తాను. అతని మాటలను మరిన్ని సార్లు వింటాం', 'అతనిపై బయోపిక్ ఎందుకు తీయలేదని నేను ఆశ్చర్యపోతున్నాను?' అంటూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

Next Story