Sobhita Dhulipala: శోభిత పెళ్లి వీడియో వైరల్.. ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొన్నానంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-09-13 11:37:04.0  )
Sobhita Dhulipala: శోభిత పెళ్లి వీడియో వైరల్.. ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొన్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రజెంట్ ఈ అమ్మడు రాజీవ్ సిద్దార్థ్‌తో కలిసి ‘లవ్ సితార’ మూవీలో చేస్తుంది. దీనిని వందన్ కటారియా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా 2020లోనే షూటింగ్ మొదలైంది కానీ విడుదల కాలేదు. మళ్లీ నాలుగేళ్లకు ఇప్పుడు థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు జీ5 అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, లవ్ సితార ట్రైలర్ విడుదల చేస్తూ శోభిత ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ట్రైలర్‌లో పెళ్లి వద్దు అని తన ఫ్రెండ్ చెప్పినప్పటికీ ఆమె మాత్రం నాకు పెళ్లి, పిల్లలు కావాలి అందులో తప్పేముంది అని చెప్తుంది. ఫ్యామిలీని ఒప్పించి తన ప్రియుడిని గ్రాండ్‌గా కేరళలో పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె మ్యారేజ్ లైఫ్ ఎలా మారిందో చూపించిన సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రజెంట్ లవ్ సితార ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ శోభిత.. ‘‘ఈ మధురమైన, వినయపూర్వకమైన కుటుంబ-నాటకాన్ని ప్రదర్శించడానికి కోవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలో చాలా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొని దీనిని కేరళలో చిత్రీకరించాము. నాకు ‘లవ్ సితార’ బలమైన, సున్నితమైన కలయిక. తన సొంత నమూనాలను ప్రశ్నించడానికి, ఛేదించడానికి ధైర్యంగా ఉన్న ఒక విజయవంతమైన కెరీర్ గర్ల్ కథ ఇది. ఈ కథలో స్త్రీల గౌరవానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఈ చిత్రాన్ని చూసి ఈ కథలో కష్టపడి నటించిన అద్భుతమైన నటీనటులను, సిబ్బంది అందరినీ ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.

కాగా, శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉన్న ఆమె ఇటీవల నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో అంతా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరూ పెళ్లి డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ చైతు, శోభిత ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Read More : Naga Chaitanya-Shobhita: రానా టాక్ షోకు నాగచైతన్య-శోభిత.. సీక్రెట్ లవ్‌స్టోరీని బయటపెట్టనున్నారా?

Advertisement

Next Story