నాగచైతన్యతో పెళ్లి నిజమేనా.. శోభితా పోస్ట్ వైరల్

by samatah |
నాగచైతన్యతో పెళ్లి నిజమేనా.. శోభితా పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారు, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా శోభిత తన సోదరి పెళ్లిలో జరిగిన కొన్ని ఫోటోలను, విషయాలను పంచుకుంది.. అయితే తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.అదేంటంటే..ఆమె నార్త్ సౌత్ ని కలిసినప్పుడు అనే క్యాప్షన్ పెట్టింది. ఇక శోభిత ధూళిపాల అలా పోస్ట్ పెట్టిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యి శోభిత కూడా సౌత్ కి చెందిన అమ్మాయి కాబట్టి బాలీవుడ్ లో కూడా యాక్టివ్ అయింది. అయినప్పటికీ ఈమె సౌత్ హీరో అయినా నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అనే విషయాన్ని పరోక్షంగా ఈ పోస్ట్ ద్వారా తెలియజేసిందా ఏంటి అంటూ చాలామంది నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story