- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వీళ్లందరూ ఎవెంజర్స్.. నా పిల్లలకు చెబుతాను’: Sobhita Dhulipala
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శోభితా అండ్ నాగచైతన్య ఇటీవలే కుటుంబీకుల సమక్షంలో సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో అక్కినేని అభిమానులంతా షాకింగ్‌కు గురవ్వడంతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక వీరి పెళ్లి తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరీ. ఇదిలా ఉండగా.. నటి శోభితా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాల్లో పొన్నియిన్ సెల్వన్-1 ఒకటి. ఈ మూవీలో అద్భుతంగా నటించి.. తన నటనతో నెటిజన్లను కట్టిపడేసింది. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో జయం రవి, కార్తి, విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు.
అయితే ఈ సినిమా రిలీజై.. 2 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల చిత్ర బృందంతో ఉన్న బాండింగ్‌ను గుర్తు చేసుకుంది. కాగా టీమ్‌తో దిగిన పిక్‌ను సోషల్ మీడియాలో పంచుకుని.. ‘వీళ్లంతా ఎవెంజర్స్. వీరి గురించి నా పిల్లలకు చెప్తాను’ అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్-1 చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.