ఆ పని చేయకపోతే అస్సలు నిద్రపట్టదు.. ప్రతిరోజూ ఉండాల్సిందే

by Hamsa |   ( Updated:2023-09-11 17:15:45.0  )
ఆ పని చేయకపోతే అస్సలు నిద్రపట్టదు.. ప్రతిరోజూ ఉండాల్సిందే
X

దిశ, సినిమా: నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్, నటి శోభిత ధూళిపాళ తనకు చేతినిండా పనిలేకపోతే అస్సలు నిద్రపట్టదంటోంది. ఇటీవల వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2’తో అభిమానులను అలరించిన ఆమె.. జోయా అక్తర్ తనకు ప్రధాన పాత్ర ఇవ్వడం నమ్మలేకపోయానని చెప్పింది. ‘నా టాలెంట్‌ ఆధారంగానే మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారని నమ్ముతున్న. నా పాత్ర రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుంది. ధైర్యం, నైతిక విలువలు, హడావుడి చేసే మనస్తత్వం అన్ని సేమ్. అందుకే జనాలు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ల అభిమానమే మరిన్ని మంచి పాత్రలు ఎంచుకునేలా ప్రొత్సహిస్తుంది’ అని చెప్పింది. అయితే తనకెప్పుడూ చేతినిండా పని ఉండాలని కోరుకున్నప్పటికీ తరచూ తెరపై కనిపించాలనే తపనతో గుడ్డిగా పాత్రలు ఎంచుకోనని తెలిపింది. ‘నాకంటూ కొన్ని ఇష్టాలు, అభిరుచులున్నాయి. వాటికి అనుగుణంగానే నడుచుకుంటా. సైన్ చేసిన క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేస్తా’ అని తెలిపింది. చివరగా ‘డాన్ 3’లో అవకాశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని శోభిత ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పింది.

ఇవి కూడా చదవండి : పెళ్లికి ముందు SEX.. ప్రేమికులు అలాగే చేయాలంటున్న నటి

Advertisement

Next Story

Most Viewed