ఆ లక్షణాలున్నవాడినే పెళ్లాడతా.. ముఖ్యంగా ఆ అలవాటు ఉండాలి

by sudharani |   ( Updated:2023-06-21 10:57:07.0  )
ఆ లక్షణాలున్నవాడినే పెళ్లాడతా.. ముఖ్యంగా ఆ అలవాటు ఉండాలి
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పేసింది. ఆమె నటించిన తాజా ప్రాజెక్ట్ ‘ది నైట్ మేనేజర్ 2’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె.. కెరీర్ అండ్ వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయింది. ‘నన్ను పెళ్లిచేసుకునేవాడికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. సింప్లీసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగివుండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదమే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్లుగానే లైఫ్‌లోని ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించాలి. ముఖ్యంగా నా క్యారెక్టర్, పనిని ఇష్టపడేవాడు కావాలి’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ఇక చివరగా తనపై వచ్చే పుకార్లను అస్సలు పట్టించుకోనన్న నటి.. ఉత్తమమైన పని చేయడంకోసం ప్రతిరోజు శక్తికిమించి శ్రమిస్తూనే ఉంటానని తెలిపింది.

Read More: లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోకపోతే.. ఆ టీడీపీ నేత కుమార్తెనే చేసుకునేవాడిని: ఎన్టీఆర్

Advertisement

Next Story