- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నీ రాకతో అంతా మారిపోయింది’.. వెడ్డింగ్ డే సందర్భంగా మౌనిక పై మంచు మనోజ్ వైరల్ పోస్ట్..
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు మనోజ్- భూమా మౌనికాల వివాహం జరిగి నిన్న (మార్చి 3) తో ఏడాది అయింది.దీంతో తమ మొదటి వెడ్డింగ్ డే ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ లవ్లీ కపుల్. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే వీరిద్దరు తమ తమ సోషల్ మీడియా వేదికలో పరస్పరం వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్, ధైరవ్‌లతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసి..
‘నా ప్రియమైన భార్య మౌనికకు మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, సంతోషం తో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బుజ్జాయి కోసం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ రాక నా జీవితాన్ని ప్రేమతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేను. కానీ వారిలా మిమ్మల్ని సంరక్షిస్తానని మాటిస్తున్నాను. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని రక్షించుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు నా మనసు, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే నీ మను’ అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు మనోజ్.