షూటింగ్ అయిపోయిన వెంటనే శ్రీముఖి ఆ పని చేస్తుంది.. సంచలన నిజం బయటపెట్టిన సింగర్

by Anjali |
షూటింగ్ అయిపోయిన వెంటనే శ్రీముఖి ఆ పని చేస్తుంది.. సంచలన నిజం బయటపెట్టిన సింగర్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖిపై సింగర్ శ్వేత మోహన్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను డ్రెస్ అప్ అయి వెళ్లేసరికి శ్రీముఖి షూటింగ్ ప్రారంభిస్తుంది. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెళ్లిపోతుంది. అందుకే ఆమెతో నాకు ఎక్కువగా బాండింగ్ లేదు. కానీ తనకు నేను అభిమానిని.

తను ఎంతసేపైనా చాలా ఎనర్జీగా మాట్లాడగలుగుతుంది. సెట్స్ లో ఉన్నంత సేపు నాతో చాలా బాగా మాట్లాడుతుంది. బయట పర్సనల్ గా అయితే అంత బాండింగ్ ఏం లేదు. సెట్స్ లో పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. ప్రేమను పంచుతుంది. మరో షూటింగ్ ఉంటుంది కాబట్టి.. ఇక్కడ షూటింగ్ అయిన వెంటనే చెక్కేస్తుంది’’. అంటూ సింగర్ శ్వేత మోహన్ చెప్పుకొచ్చింది.

ఇక శ్రీముఖి గత ఏడాది తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో రొమాంటిక్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోని నడుము సీన్ చిరు-శ్రీముఖి స్పూఫ్ చేసి ఆడియన్స్ ను నవ్వించారు. ప్రస్తుతం ఈ అమ్మడుకు వెండితెరపై మంచి అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed