- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hardeep Singh Puri: రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి ఎందుకు చమురు కొనుగోలు చేశామో చెప్పుకొచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian Oil) చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామని చెప్పారు. దీనిపై హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘‘రష్యా (Russia) చమురు కొని భారత్ (India) యావత్ ప్రపంచానికి మేలు చేసింది. ఒకవేళ మేం అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా ఇంధన ధరలు (Oil Prices) ఆకాశాన్నంటేవి. బ్యారెల్ చమురు ధర 200 డాలర్ల (రూ.16వేలకు పైమాటే)ను చేరేది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు. కేవలం ధరల పరిమితి మాత్రమే ఉంది. దాన్ని భారతీయ సంస్థలు కూడా అనుసరిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఆంక్షలు పడే అవకాశముందని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ, ఇదే సమయంలో యూరప్, ఆసియాకు చెందిన చాలా దేశాలు రష్యా నుంచి బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు (Crude Oil), డీజిల్, ఎల్‌ఎన్‌జీ, అరుదైన ఖనిజాలను కొనుగోలు చేశారు కూడా.’’ అని కేంద్రమంత్రి రాసుకొచ్చారు.
ఇంధన ధరలు
భారత చమురు సంస్థల (Oil Companies)కు ఎక్కడ లాభం చేకూరుతుందో అక్కడి నుంచే వాటిని కొనుగోలు చేస్తామని హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) స్పష్టం చేశారు. దేశ పౌరులకు అందుబాటు ధరల్లో స్థిరమైన ఇంధన వనరులను అందించడమే తమ అగ్ర ప్రాధాన్యమని తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గత మూడేళ్లుగా ఇంధన ధరలు తగ్గుతున్న దేశం భారత్ అని చెప్పుకొచ్చారు.