సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న సింగర్ మంగ్లీ పెళ్లి పాట.. (వీడియో)

by Disha Web Desk 6 |
సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న సింగర్ మంగ్లీ పెళ్లి పాట.. (వీడియో)
X

దిశ, సినిమా: సింగర్ మంగ్లీ జానపద పాటలు పాడి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే పలు సినిమా సాంగ్స్ పాడి తన గొంతుతో స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ప్రస్తుతం మంగ్లీ స్టార్ హీరోల సినిమాల్లో మాస్ సాంగ్స్ పాడుతూ దుమ్మురేపుతుంది. తాజాగా, మంగ్లీ ‘జితేందర్ రెడ్డి’ సినిమాలో పాడిన పెళ్లి పాట సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

తెలంగాణ భాషలో లచ్చిమక్క అంటూ సాగే ఈ పాట విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా, జితేందర్ రెడ్డి సినిమా విరించి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో వైశాలి రాజ్, రియా, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే జితెందర్ రెడ్డి నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మంగ్లీ పాడిన పెళ్లి పాట ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

Next Story

Most Viewed