- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lok sabha Elections: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో సంచలనం.. ప్రధానిపై పోటీ చేయబోతున్న ఆ స్టార్ కమెడియన్
దిశ, వెబ్‌డెస్క్: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో సంచలనం చోటుచేసుకోబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న హాస్య నటుడు శ్యామ్ రంగీలా వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయబోతున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించారు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో ‘వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన తరువాత మీ అందరి నుంచి వస్తున్న ప్రేమ, ఆత్మాభిమానాలను చూసి సంతోపడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల నా అభిప్రాయాలను త్వరలో వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. వారణాసి చేరుకున్న తరువాత మెసేజ్ చేస్తా’ అని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు వారణాసి నుంచి శ్యామ్ రంగీలా ఎందుకు పోటీ చేస్తున్నాడోనని నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. అనంతరం శ్యామ్ రంగీలా మీడియాతో మాట్లాడుతూ.. 2014లో నేను ప్రధాని నరేంద్ర మోదీకి ఫాలోవర్‌ను అని అన్నాడు. ప్రధానికి మద్దతుగా పలు వీడియోలు కూడా షేర్ చేశానని పేర్కొన్నాడు. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశానని స్పష్టం చేశారు. వచ్చే 70 ఏళ్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేస్తానని గతంలో చెప్పాను, కానీ గడిచిన పదేళ్లలో పరిస్థితి మారిందని అన్నాడు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని శ్యామ్ రంగీలు తెలిపాడు.