మెట్ల మీద నుంచి పడిపోయిన సింగర్.. ఎలా ఉన్నాడంటే..

by Harish |   ( Updated:2022-12-03 14:33:21.0  )
మెట్ల మీద నుంచి పడిపోయిన సింగర్.. ఎలా ఉన్నాడంటే..
X

దిశ, సినిమా: బాలీవుడ్ గాయకుడు జుబిన్ నౌటియాల్ డిసెంబర్ 1న తన నివాసంలో మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో మోచేయి విరిగిపోయింది. పక్కటెముకల్లో పగుళ్లు రావడంతో పాటు తలపై చిన్న గాయమైంది. దీంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు, డిసెంబర్ 2న జుబిన్ తదుపరి చికిత్స కోసం తన స్వస్థలమైన ఉత్తరాఖండ్‌కు బయలుదేరాడు.

ఇక శుక్రవారం ట్రీట్మెంట్ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు హెల్త్ అప్‌డేట్‌ ఇచ్చాడు. తన క్షేమం కోరిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 'మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. దేవుడు ఉన్నాడు, అందుకే ఈ ఘోర ప్రమాదం నుంచి నన్ను రక్షించాడు. నేను డిశ్చార్జ్ అయ్యాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. డాక్టర్స్ ఇంకా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు' అని ట్వీట్ చేశాడు.

READ MORE

టిక్ టాక్ ఫేమస్ స్టార్ మృతి

Advertisement

Next Story