- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరంగేట్రంలోనే ఇలాంటి సినిమా చేస్తున్నందుకు భావోద్వేగానికి లోనయ్యా.. నమ్మడానికే మూడు రోజులు పట్టింది
దిశ, సినిమా : ‘గదర్ 2’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న యంగ్ బ్యూటీ సిమ్రత్ కౌర్.. తాజా ఇంటర్వ్యూలో అమీషా పటేల్, సన్నీ డియోల్‌లతో సెట్ షేర్ చేసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆగస్ట్ 11న ఈ మూవీ విడుదలకానున్న ఈ మూవీలో ఆఫర్ వచ్చిందని తెలిసినపుడు చాలా ఆశ్చర్యపోయానని, తన ఫస్ట్ రియాక్షన్ చూసిన ఫ్రెండ్స్ కంగుతిన్నారని చెప్పింది. ‘ఎన్నో రోజుల కల నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉంది. లెజెండ్ నటులు అమీషా, సన్నీగార్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.
గదర్ ఆఫర్ వచ్చిన విషయం మా నాన్న, అక్కకు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పాను. ఎందుకంటే నేను నమ్మడానికే చాలా సమయం పట్టింది. ‘గదర్ 2’ కోసం పని చేస్తున్నానని చెప్పగానే అందరూ సంతోషించారు. బాలీవుడ్‌లో ఫస్ట్ ఇలాంటి సినిమా చేస్తున్నందుకు ఎమోషనల్ అయ్యాను. ఇది నాకు చాలా ఉద్వేగభరితమైన క్షణం. అయితే తెలుగు, పంజాబీలో నా ఫర్మార్మెన్స్‌పై ట్రోలింగ్ జరిగినపుడు చాలా డిజప్పాయింట్ అయ్యాను. కానీ ఇకనుంచి అల జరగదు’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది సిమ్రత్.