ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ..

by sudharani |
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ..
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ 'తెలుసు కదా'తో బిజీగా ఉన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా డెబ్యు చేస్తున్నారు. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తిచేసుకుని నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి కాగా.. అవుట్‌పుట్‌తో టీమ్‌ హ్యాపీగా ఉనట్లు తెలుస్తుంది. అలాగే నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలోని మొదటి పాటను సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి. కాగా.. ‘తెలుగు కదా’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.

Read More....

Raj Tarun: 11 రోజులు ఫుట్‌పాత్‌పై పడుకున్నా.. టాలీవుడ్ యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

Advertisement

Next Story