Jani Master : జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు

by M.Rajitha |   ( Updated:2024-09-18 14:43:45.0  )
Jani Master : జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : జానీ మాస్టర్(Johny Master) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్(Zero FIR) నమోదు చేసి, కేసును బాధితురాలి నివాసం అయిన నార్సింగికి బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలను తెలుసుకొని, కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల నుండి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ పేర్కొనడంతో, బాధితురాలి వయసు రీత్యా జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు.. నార్త్ ఇండియాలో ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.

Read More...

Johnny Master: జానీ మాస్టర్ వివాదంలో కీలక పరిణామం.. తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు

Advertisement

Next Story

Most Viewed