- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: పసిబిడ్డల ప్రాణాలకు విలువేది? దీనిపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా అని, తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాంధీ హాస్పిటల్ లో ఒక నెలలో చనిపోయిన పసిపిల్లల జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేగాక దీనిపై విచారణ జరిపించాలని తెలంగాణ సీఎస్ ను డిమాండ్ చేశారు. దీనిపై ఆయన.. 48 మంది పసి గుడ్డులు.. 14 మంది బాలింత తల్లులు.. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? అని ప్రశ్నించారు. ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా? అని మండిపడ్డారు. తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోందని, ఎందుకు భయపడుతోందని నిలదీశారు.
అంతేగాక ఆ తల్లీబిడ్డల ఉసురు మీకు తగలదా.. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు, సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లి, బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారు చేశారని, ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవటం అంటే అదేనని, మరీ మన చీప్ మినిస్టర్ ఏం చేస్తున్నారోనని ఎద్దేవా చేశారు. పాలన గాలికి వదిలి, ప్రచారా ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని ఆరోపించారు. ఇక శిశు మరణాలు, మాతాశిశు మరణాల రేటును తగ్గించడానికి తెలంగాణ స్పృహతో చాలా నిశితంగా పనిచేసిందని, మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2023 వరకు తెలంగాణలో అత్యుత్తమ ఐఎమ్ఆర్, ఎమ్ఎమ్ఆర్ లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో పౌరులకు తెలియజేయాలని తెలంగాణ సీఎస్ ను డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.