NIHARIKA KONIDELA: ‘సినిమా బడ్జెట్ గురించి సిద్ధుతో నిహారిక క్యూట్ డిష్కషన్

by Anjali |
NIHARIKA KONIDELA: ‘సినిమా బడ్జెట్ గురించి సిద్ధుతో నిహారిక క్యూట్ డిష్కషన్
X

దిశ, సినిమా: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. వంశీ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ ఈవెంట్‌కు టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే.

అయితే ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ అండ్ నిహారిక ఆసక్తికర డిస్కషన్ పెట్టారు. సినిమా అనేది చిన్నది, పెద్దది అనేది ఏం ఉండదు. ఓ మూవీకి సినిమాకు తక్కువ బడ్జెట్ పెడతాం. ఓ చిత్రానికి ఎక్కువ ఖర్చు పెడతామంతే అంటూ నిహారికతో సిద్ధు చర్చించాడు. అనంతరం సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన మెగా డాటర్ నిహారికకు ధన్యవాదాలు తెలియజేశాడు. నిహారిక గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ కార్యక్రమాన్ని హాజరైన పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ అంటూ నినాదాలతో హోరెత్తించగా.. వెంటనే నిహారిక మైక్ తీసుకుని ‘మీరే కాదు.. నేను కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాలుకే’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ హో కొడుతూ గట్టిగా అరిచారు.


Read more...

Mega Couples: పారిస్ ఒలంపిక్స్.. పారిస్ వీధుల్లో సందడి చేస్తున్న మెగా కపుల్స్.. (పోస్ట్)



Next Story

Most Viewed