హీరో అవుతానంటే ఎవరూ నమ్మలేదు.. కెరీర్ స్ట్రగుల్‌పై సిద్ధార్థ్

by srinivas |
హీరో అవుతానంటే ఎవరూ నమ్మలేదు.. కెరీర్ స్ట్రగుల్‌పై సిద్ధార్థ్
X

దిశ, సినిమా : యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పర్సనల్ లైఫ్‌తో పాటు కెరీర్‌లోనూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానంటున్నాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన సిద్ధార్థ్.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ నటుడిగా కలను నిజం చేసుకోవడం కోసం ఆ వృత్తిని మధ్యలోనే వదిలేసి ఎంతో స్ట్రగుల్ అయినట్లు తెలిపాడు. న్యూ ఢీల్లిలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సాధారణ యువకుడు వెండి తెరపైకి రావాలని అనుకోవడం దూరపు కలలాంటిదని, తన డ్రీమ్ గురించి ఇంట్లో చెబితే ఎవరూ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకునేవారు కాదని తెలిపాడు.

కానీ, యుక్తవయస్సులోనే కెమెరా ముందు స్టిల్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవడం ప్రారంభించానన్న ఆయన.. తన మొదటి జీతం రూ.7000 తల్లికి ఇచ్చినట్లు చెప్పాడు. అలాగే మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో లాంచ్ అవడం తన జీవితంలో ఒక పెద్ద మైలురాయిగా పేర్కొన్న హీరో.. ఇక గడిచిన పదేళ్లను తిరిగేసి చూస్తే ఇష్టమైన పనిని నిలబెట్టుకోవడం కోసం చేసిన పోరాటాలన్నీ కళ్లముందు కదలాడుతాయని చెప్పాడు. చివరగా ప్రజలను అలరించడమే తనకు పెద్ద పనిగా భావిస్తానని బలంగా నమ్ముతున్నట్లు తెలిపాడు. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'థాంక్ గాడ్' అక్టోబర్ 25న విడుదల కానుంది.

Advertisement

Next Story