Siddharth–Aditi Rao Hydari: యాపిల్ సీఈఓతో సిద్దార్థ్-అదితి.. రెండు ఐఫోన్లతో అట్రాక్టింగ్ ఫొటోలు వైరల్

by Anjali |   ( Updated:2024-09-12 15:07:42.0  )
Siddharth–Aditi Rao Hydari: యాపిల్ సీఈఓతో సిద్దార్థ్-అదితి.. రెండు ఐఫోన్లతో అట్రాక్టింగ్ ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ అండ్ నటి అదితి రావు హైదరీ రీసెంట్‌గా యాపిల్ సీఈఓ టీమ్ కుక్‌ను మీట్ అయ్యారు. అదితి, సిద్ధార్థ్ ఐఫోన్ 16 సిరీస్‌ కొనడానికి అమెరికాలోనే కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ యాపిల్ సంస్థకు చెందిన స్టీవ్ జాబ్స్ థియేటర్‌కు వెళ్లి.. యాపిల్ న్యూ మోడల్ ఫోన్ కొనుగోలు చేశారు. ఈ కపుల్ ఖరీదైన యాపిల్ ఫోన్‌ను కొన్నారు. రెండ్రోజుల క్రితం మార్కెట్‌లో ఐఫోన్ 16 సిరీస్ ను భారత్ ప్రపంచ మార్కెట్‌లో యాపిల్ కంపెనీ లాంచ్ చేసింది.

ఈ క్రమంలో హీరోయిన్ అదితి అండ్ సిద్ధార్థ్ కూడా ఐఫోన్ 16 సిరీస్‌ కొనడానికి అమెరికా వెళ్లారు. అంతేకాకుండా యాపిల్ సీఈఓను కలిసి ముచ్చటించారు. ఆయనతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా అదితి సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ‘ఇది మర్చిపోలేని అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. టీమ్ కుక్ చాలా కూల్‌గా మాట్లాడారని, గత టు డేస్ మాకు చాలా ప్రత్యేకమైనవి. యాపిల్ టీమ‌తో మా చుట్టూ క్రియేటివిటీ, టెక్నాలజీతో నిండి ఉన్నాం’ అంటూ క్యాప్షన్ జోడించి యాపిల్ సీఈఓతో ఉన్న ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు.

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ జంట మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు ప్రేమలో ఉన్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకొన్న ఈ కపుల్ పెళ్లి ఒకటే పెండింగ్‌లో ఉంది. అదితి, సిద్ధార్థ్ పెళ్లి కూడా చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నామని ఈ జంట నెటిజన్లకు క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed