- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
అందాలు చూపిస్తేనే హీరోయిన్లకు అవకాశాలంటూ.. వైరల్ అవుతున్న శ్రుతి శర్మ కామెంట్స్

దిశ, సినిమా: చాలా మంది సినిమాల్లోకి వెళ్లాలంటే భయపడతారు. టాలెంట్ ఉండి ఇలా వెనుకడుగు వేసిన వాళ్లు వేలల్లో ఉన్నారు. ఎందుకంటే అసభ్యకర సన్నివేశాల వల్ల పేరు ఎక్కడ చెడిపోతుందా అని రాకుండా ఉండిపోతారు. ఇప్పటికీ చాలా మంది హీరోలు చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటున్నారు.
మరి కొందరు లిప్ లాక్, గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటే ఆ సినిమాకి సైన్ కూడా చేయరు. 100 లో 70 మంది తారలు ఇలాంటి ఈ కారణంగానే అవకాశాలను కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు. హీరామండి సినిమాలో ఇంటిమసీ సీన్స్ చిత్రీకరించే వరకు తన పరిస్థితి ఇలాగే ఉందంటూ శ్రుతి శర్మ చెప్పింది.
హిరామండి లో తన పాత్రతో ఇటీవల ఫేమస్ అయిన శ్రుతి శర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా వ్యాఖ్యలు చేసింది. హిరామండి కంటే ముందు వరకు తెరపై ముద్దు సన్నివేశాలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది. రొమాంటిక్ సన్నివేశాలను తెరపై ఎప్పుడూ చేయకూడదనే అనుకున్నాను.. కానీ, ఇలాగే చాలా ప్రాజెక్ట్స్ కోల్పోయాను.. ఇక్కడ ఎంత గొప్పగా అందాలు చూపిస్తే అంత త్వరగా అవకాశాలు అంటూ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.