BRS: పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం తీరు.. మాజీ మంత్రి హరీష్ రావు

by Ramesh Goud |
BRS: పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం తీరు.. మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP)లను వ్యక్తిగత భద్రత నుంచి తప్పించడం అనాలోచిత నిర్ణయమని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం(CM) వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత(BRS Leader) హరీష్ రావు(Harish Rao) అన్నారు. కానిస్టేబుళ్ల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వం(Telangana Govt)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని, తన వ్యక్తిగత భద్రత నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. అలాగే పదిహేడు వేల మంది స్పెషల్ పోలీసులను తన చర్యతో సీఎం అవమాన పరిచారని, రేవంత్ రెడ్డి చర్య తండ్రి కొడుకులను విశ్వాసంలోకి తీసుకోనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ(Military) లాంటి వారని, వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బతీయకూడదని, స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్(Demand) చేశారు. ఏక్ పోలీస్(EK POLICE) విధానాన్ని తీసుకురాబోతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక సస్పెండ్(Suspend), డిస్మిస్(Dismiss) అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు సీఎం జోక్యం చేసుకోవాలని, స్పెషల్ పోలీసుల పై సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్(Circular) ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు చేసినా, ఆ పోలీసులు పట్ల చర్యలు ఉంటాయని పేర్కొనడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు.. భావప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.


Advertisement

Next Story

Most Viewed