సెల్యూట్ టూ ఫాంటమ్.. తీవ్రవాదుల దాడిలో వీరమరణం

by karthikeya |
సెల్యూట్ టూ ఫాంటమ్.. తీవ్రవాదుల దాడిలో వీరమరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తీవ్రవాదుల దాడిలో ఇండియన్ సోల్జర్ డాగ్ ఫాంటమ్ వీర మరణం పొందింది. జమ్మూ (Jammu)లోని అఖ్నూర్ సెక్టార్‌లోని సోమవారం నాడు నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర దాడులు-ప్రతిదాడులు జరిగాయి. 8 గంటలపాటు సాగిన ఈ కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన సోల్జర్ డాగ్ ఫాంటమ్ (Soldier Dog Phantom) తీవ్రవాదుల బుల్లెట్లకు బలై కన్ను మూసింది.

సోమవారం ఉదయం 7 గంటల సమయంలో జమ్మూ నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఖ్నూర్ ఖుర్ యుద్ధ ప్రాంతంలో హఠాత్తుగా ఆర్మీ కాన్వాయ్‌ (Army Convoy)పై ముగ్గురు తీవ్రవాదులు దాడి చేశారు. కాన్వాయ్‌లోని ఆంబులెన్స్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అక్కడే ఉన్న ఫాంటమ్‌కు కూడా బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడి మరణించింది.

ఈ ఘటనపై వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ (X) వేదికగా.. ‘మన సైనికులు చిక్కుకున్న ఉగ్రవాదులను సమీపిస్తున్నప్పుడు, తీవ్ర వాదుల దాడిలో ఇండియన్ ఆర్మీ సోల్జర్ డాగ్ ఫాంటమ్‌ తీవ్రంగా గాయపడింది. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనిది’’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు.

ఇక ఈ ఘటన అనంతరం ఆర్మీ కూడా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది (Terrorist) హతమయ్యాడని, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ వెల్లడించింది. కాగా.. మరణించిన ఉగ్రవాది ఆర్మీ డ్రెస్‌‌ వంటి దుస్తుల ధరించి ఉండటంతో ఈ టెర్రరిస్ట్‌లకు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ (Jaish-e-Mohammed)తో సంబంధం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed