స్నానం చేస్తున్నపుడు యూరిన్ చేస్తా: శృతి హాసన్ స్టేట్మెంట్ వైరల్

by Nagaya |
స్నానం చేస్తున్నపుడు యూరిన్ చేస్తా: శృతి హాసన్ స్టేట్మెంట్ వైరల్
X

దిశ, సినిమా : హీరోయిన్ శృతిహాసన్‌ మైండ్ బ్లాక్ అయ్యే పర్సనల్‌ విషయాలు బయటపెట్టింది. ఇటీవల తన ఫాలోవర్లతో ‘ఆస్క్ మీ ఎవ్రీథింగ్’ అనే సెషన్ నిర్వహించిన ఆమె.. నెటిజన్లు తిక్క తిక్క ప్రశ్నలడిగినా ఓపికతో సమాధానమిచ్చింది. ‘నీవు నీ యూరిన్ స్మెల్ చూసుకున్నావా? స్నానం చేసేటప్పుడే పోస్తావా? మిస్టేక్‌లో ఎప్పుడైనా చేయి మీద పోసుకున్నావా?’ అని అడిగారు. దీంతో ఏ మాత్రం కంగారుపడని నటి.. ‘స్నానం చేసేటప్పుడే పోస్తాను. చేతి మీద ఎప్పుడూ పడనివ్వలేదు. స్మెల్ చూడను’ అని చెప్పింది. అలాగే ‘నీ గుండె ఏ కలర్‌లో ఉంటుంది? బ్లాక్‌ కలరా?’ అని అడిగితే.. ‘కాదు.. పింక్ కలర్‌లో ఉంటుందేమో’ అని సెటైర్ వేసింది. చివరగా తనను ప్రేమించమని, డేటింగ్‌కు రమ్మని, పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది హంగామా చేయగా.. ‘నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు’ అంటూ చురకలంటించింది.

Advertisement

Next Story