అందుకే సీక్రెట్‌గా ఉంచా.. తన ప్రెగ్నెన్సీ టైమ్ గురించి శ్రియ స్పందన

by Hajipasha |   ( Updated:2023-10-10 15:59:42.0  )
అందుకే సీక్రెట్‌గా ఉంచా.. తన ప్రెగ్నెన్సీ టైమ్ గురించి శ్రియ స్పందన
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆల్ మోస్ట్ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ.. ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో అడపాదడపా చిత్రాలు చేస్తుస్తోంది. అయినప్పటికీ బాలీవుడ్‌లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. అక్కడ కూడా సీనియర్ స్టార్స్ పక్కన ఆఫర్లు దక్కుతున్నాయి. రీసెంట్‌గా శ్రియ, నటుడు అజయ్ దేవగన్ భార్యగా 'దృశ్యం 2' మూవీలో నటించి సక్సెస్ అందుకుంది. ఒక పక్క మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, మరో పక్క చక్కగా సినిమాలు చేస్తోంది శ్రియ. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. ఆమెకు అందమైన పాప పుట్టిన విషయం మనకు తెలిసిందే. కానీ ఆమె మాత్రం పబ్లిక్‌గా ఎన్నడూ అనౌన్స్ చేయలేదు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ''నా ప్రెగ్నెన్సీ గురించి నేను మాట్లాడక పోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. అప్పుడు నా కూతురు రాధ కడుపులో ఉంది. ఆ అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలనుకున్నాను. లావుగా అవుతున్నందున దాని గురించి చింతించకుండా ఉండాల్సి వచ్చింది. అభిమానులకు, ప్రజలకు చెబితే నా బాడీ షేప్ గురించి రాస్తారు. నా బిడ్డపై దృష్టి పెడతారు. అందుకే ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి టైమ్ వేస్ట్ చేయాలనుకోలేదు" అంటూ చెప్పుకొచ్చింది.

READ MORE

రెజీనాతో ప్రేమలో పడ్డ యంగ్ హీరో Sundeep Kishan..!

Advertisement

Next Story