చిన్నతనంలో నేనూ ఆ ఒత్తిడికి లోనయ్యాను.. Shriya Saran శ్రియా శరణ్

by Prasanna |   ( Updated:2023-05-09 07:11:06.0  )
చిన్నతనంలో నేనూ ఆ ఒత్తిడికి లోనయ్యాను.. Shriya Saran  శ్రియా శరణ్
X

దిశ, సినిమా : మనసుకు దగ్గరగా ఉండే కథలు, పాత్రలు చేసినపుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనంటోంది సీనియర్ నటి శ్రీయా శరణ్. తను నటించిన ‘మ్యూజిక్ స్కూల్’ మే12న విడుదల కానుండగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ‘‘మ్యూజిక్ స్కూల్’ ఒక అందమైన కథ. సున్నితమైన వినోదం, ఎమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. కళలు ఎంత ముఖ్యమో ఈ సినిమా కళ్లకు కడుతుంది. స్టోరీ వినగానే కనెక్ట్ అయ్యాను. చిన్నపిల్లలతో నటించడం బాగుంది. నేటి పిల్లలు భారం మోయలేక సతమతమవుతున్నారు. నేనూ చిన్నతనంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. డాక్టర్, ఇంజనీర్ అంటూ నిరంతరం ఏదో బరువు నెత్తినపెడుతున్నారు. కానీ, మా తల్లిదండ్రులు నన్ను డ్యాన్స్ వైపు ప్రోత్సహించారు. అలా కథక్ నేర్చుకుని నటిని అయ్యాను. ఇప్పటికీ బాధలో ఉంటే నా కూతురితో కలిసి నృత్యం చేస్తా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Read More: మంత్రితో హోటల్‌లో శృంగారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ అంటూ ట్వీట్ చేసిన ఉమైర్ సంధు

Next Story

Most Viewed