పది నిమిషాలు ఆగిపోయిన ఆ హీరో గుండె .. హాస్పిటల్‌లో క్రిటికల్ సిచ్యువేషన్‌లో..

by Prasanna |   ( Updated:2023-12-16 13:06:16.0  )
పది నిమిషాలు ఆగిపోయిన ఆ హీరో గుండె .. హాస్పిటల్‌లో క్రిటికల్ సిచ్యువేషన్‌లో..
X

దిశ, సినిమా : ‘యానిమల్’తో స్పెషల్ అప్లాజ్ అందుకుంటున్న బాబీ డియోల్.. తన క్లోజ్ ఫ్రెండ్ శ్రేయాస్ తల్పడే ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్‌గానే ఉన్నట్లు తెలిపాడు. హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో జాయిన్ అయిన శ్రేయాస్ గుండె దాదాపు 10 నిమిషాలు ఆగిపోయినట్లు చెప్పాడు. అయితే డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించి అతని ప్రాణాలు కాపాడారని వివరించాడు. ఆయన భార్య దీప్తితో మాట్లాడానని.. శ్రేయాస్ హెల్త్ ప్రోగ్రెసివ్‌గా ఉందని చెప్పాడు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తాడని నమ్ముతున్నానని.. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపాడు.

అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న ‘జంగిల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న శ్రేయాస్.. ఆ రోజు యాక్షన్ సీక్వెన్సెస్ చేశాడని తెలుస్తుంది. ఇంటికి వచ్చే క్రమంలో ఆరోగ్యం బాగాలేదని అనిపిస్తుందని భార్యకు చెప్పాడని.. హాస్పిటల్‌కు వెళ్తున్న క్రమంలోనే హార్ట్ ఎటాక్‌తో పడిపోయాడని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed