- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబానీ ఇంట్లో రష్మికకు అవమానం.. షాక్‌లో అలాగే నిలబడిపోయిన బ్యూటీ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి సందర్భంగా తాజాగా అంబానీ కుటుంబం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖుల అందరికీ అంబానీ కుటుంబం ఆహ్వానం పంపింది. అందులో సౌత్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక కూడా ఉండటం విశేషం. ఈ ఈవెంట్‌లో రష్మిక చక్కగా తెలుగింటి అమ్మాయిల చీరకట్టులో మెరిసింది. దీంతో ఫొటో గ్రాఫర్స్ కెమెరాలు పట్టుకుని రష్మికాజీ.. రష్మికాజీ అంటూ ఆమెను ఫొటోలు తీసేందుకు వెంటపడ్డారు. రష్మిక కూడా వారికి నవ్వుతూ ఫొటో ఫోజులు ఇచ్చింది.
అదే సమయంలో ప్రభాస్ బ్యూటీ శ్రద్ధా కూడా వైట్ కలర్ చుడీదార్ వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని వచ్చింది. శ్రద్దా రావడం గమనించిన రష్మిక ఆమెను పలకరించేందుకు ఒక నిమిషం ఆగింది. అయితే.. శ్రద్ధా మాత్రం రష్మికను పట్టించుకోకుండా వెళ్లిపోయింది. అది చూసి ఒక్క నిమిషం షాక్ అయిన రష్మిక.. వెంటనే తేరుకుని మళ్లీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.