ఓన్లీ ప్రభాస్ కోసమే ఆ పని చేశా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా షాకింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-10-23 13:48:56.0  )
ఓన్లీ ప్రభాస్ కోసమే ఆ పని చేశా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధాకపూర్ స్టార్ హీరో ప్రభాస్‌తో పనిచేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్, సుజిత్ కాంబోలో వచ్చిన ‘సాహో’ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రభాస్ వంటి స్టార్ హీరో సరసన నటిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవచ్చని భావించానని చెప్పింది. అయితే తాను అనుకున్నదానికి పూర్తిగా అపోజిట్ జరగడంతో డిజప్పాయింట్ అయ్యానని, ఆశలన్నీ అవిరైపోయాయని వాపోయింది. ‘ప్రభాస్‌తో రొమాన్స్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాలో నటించొద్దని నా స్నేహితులు ఎంత చెప్పినా నేను వినలేదు. ఓన్లీ ప్రభాస్ కోసమే ఈ మూవీ ఒప్పుకున్నా. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ కావడంతో కొంత ఒత్తిడికి లోనయ్యాను. అనవసరంగా తొందరపడ్డానని ఇప్పటికీ బాధపడుతుంటాను’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed