- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
chest pain : దగ్గుతున్నప్పుడు మంటగా ఉందా?.. అయితే చెస్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు
దిశ, ఫీచర్స్ : సీజన్లు మారుతున్న సమయంలోను, వాతావరణ కాలుష్యంతోను రకరకాల ఇన్ఫెక్షన్లు వ్యక్తులపై దాడి చేస్తుంటాయి. వీటివల్ల దగ్గు, జలుబు, గొంతుమంట వంటి సమస్యలు సహజంగానే తలెత్తుతాయి. అయితే ఈ సమస్య మరింత ఎక్కువైతే మాత్రం న్యుమోనియా వంటి తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు.
ఎలా వస్తాయి?
దగ్గు, జలుబు, ఫ్లూ అనేవి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతాయి. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే గనుక శ్వాస నాళాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఊపిరి తిత్తులకు గాలి సరఫరా అయ్యే మార్గంలో వాపు వస్తుంది. దీనికారణంగాఛాతీ ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు లేదా అధికమైనప్పుడు ముక్కు రంధ్రాల్లోని బ్యాక్టీరియాలతో పోరాడే ఇమ్యూనిటీ కణాలు దెబ్బతింటాయి.
ఎలా గుర్తించాలి
సాధారణంకంటే అధికంగా శ్లేష్మంతో కూడిన దగ్గు, అలాగే దగ్గుతున్నప్పుడు ఛాతీలో నొప్పిగా అనిపిస్తే ఛాతీ ఇన్ఫెక్షన్‌గా అనుమానించవచ్చు. దగ్గినప్పుడు రక్తం, కఫం వస్తుంటే ప్రమాదకర పరిస్థితిగా పరిగణించి వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఛాతీ వైద్యనిపుణుల ప్రకారం.. బ్రోన్కైటిస్, న్యూమోనియా అనే రెండు రకాల తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. బ్రోన్కైటిస్ అనేది లంగ్స్‌కు గాలిని తీసుకెళ్లే బ్రోన్చియల్ ట్యూబ్‌ని ప్రభావితం చేస్తుంది. ఇక న్యుమోనియా అనేది మరింత లోతుగా లంగ్స్ కణాలపై ప్రభావం చూపుతుంది. బ్రోన్కైటిస్ సమస్య చాలా వరకు వైరస్‌లవల్ల తలెత్తితే, న్యుమోనియా అనేది అది ఛాతీ ఇన్ఫెక్షన్ ఏర్పడిన తర్వాత తలెత్తుతుంది. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలవల్ల కూడా ఛాతీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బ్రోన్కైటిస్ కంటే న్యుమోనియా ప్రమాదకరం.
లక్షణాలు..
వారానికి మించిన దగ్గు, లైట్‌గా ఫీవర్, ఒళ్లు నొప్పిగా ఉండటం, బలహీనత వంటి లక్షణాలు ఛాతీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వారిలో తరచూ కనిపిస్తుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో భారంగా తోచడం అనేవి చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.
నివారణ ఎలా?
సాధారణంగా తీవ్రమైన జలుబుతో మొదలై ఛాతీ ఇన్ఫెక్షన్లు తలెత్తుతుంటాయి. అయితే జలుబుకు ట్రీట్ మెంట్ లేదు. ఎక్కువగా రెస్టు తీసుకోవడంవల్ల, సూప్స్, గోరు వెచ్చని నీళ్లు తాగడంవల్ల ఉపశమనం లభిస్తుంది. ఇక జలుబు అధికమైనప్పుడు ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. బాధిత వ్యక్తి గట్టిగా తుమ్మినప్పుడు ముక్కు నుంచి బయటకు వెలువడే శ్వాసకోశ తుంపరల ద్వారా కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తాయి. అందుకే బాధితులవల్ల మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. బాధితులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఏవైనా పదార్థాలు, ఆహారం తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే సమతుల్య పోషకాహారం తప్పక తీసుకోవాలి. సాధారణ ఛాతీ ఇన్ఫెక్షన్స్ అయితే నాలుగైదు రోజుల్లో ఉపశమనం కలుగుతుంది. కానీ ఎక్కువగా దగ్గు, తమ్ములు వస్తుంటే, ఆ సమయంలో ఛాతీలో నొప్పి కూడా వస్తుంటే గనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.