బాలకృష్ణ చేతుల మీదుగా 'వేద' బిగ్ టికెట్ విడుదల!

by Vinod kumar |   ( Updated:2023-02-08 11:41:24.0  )
బాలకృష్ణ చేతుల మీదుగా వేద బిగ్ టికెట్ విడుదల!
X

దిశ, సినిమా: కన్నడ హీరో శివ రాజ్‌కుమార్‌ నటించిన 125వ చిత్రం 'వేద'. గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్‌లో మొదటి వెంచర్‌గా వచ్చిన మూవీ ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించింది. కాగా కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ బిగ్ టికెట్‌ను లాంచ్ చేస్తూ చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించాడు.

అలాగే చిత్రం ట్రైలర్ చాలా బాగుందని, తెలుగులోనూ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకున్నాడు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బ్రదర్ బాలకృష్ణ రావడం సంతోషంగా ఉందన్న హీరో శివరాజ్.. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారన్నాడు. చివరగా నిర్మాత గీత, దర్శకుడు హర్ష, యం.వి.ఆర్ క్రిష్ణ, హీరోయిన్ గానవి మాట్లాడుతూ.. ఎమోషనల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్‌లో అందరూ బాగా నటించారని, మంచి కథతో వస్తున్న సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరారు.

Advertisement

Next Story

Most Viewed