Shiva Balaji: యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ చేసిన శివ బాలాజీ

by Anjali |
Shiva Balaji: యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ చేసిన శివ బాలాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. ఇది మా అశోక్‌గాడి లవ్‌స్టోరీ, ఎలా చెప్పాను, దోస్త్, ఆర్య, సంక్రాంతి, కుంకుమ, ఆంగ్లకరణ్, పోతే పోనీ, అన్నవరం, పగలే వెన్నెల, చందమామ, లక్ష్యం, శంభో శివ శంభో, కాటమరాయుడు, సింహం, సింధూరం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-1 లో విన్నర్ గా నిలిచాడు. ఇకపోతే శివ బాలాజీ తాజాగా పోలీసులకు ఆశ్రయించారు. తరచూ సినీ నటీనటులను టార్గెట్ చేస్తున్నారని, నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారని విజయ్ చంద్రహాసన్ అనే యూట్యూబర్ పై శివ బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటీనటులతో సహా గత కొంతకాలంగా మంచు విష్ణు.. అతడి నిర్మాణ సంస్థ గురించి కూడా తప్పుగా చూపుతున్నారని కంప్లైంట్ లో రాసుకొచ్చారు. ఇమేజ్ ను దెబ్బతీసేలా కొన్ని వీడియోలు సృష్టించాడని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రహాసన్ కు నోటీసులు పంపించారు.

Advertisement

Next Story

Most Viewed