- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను పోటీలో ఉంటే మలైక కెరీర్ క్లోజ్ అయ్యేది: శిల్ప
దిశ, సినిమా : ప్రముఖ మాజీ నటి శిల్పా శిరోద్కర్ సహనటి మలైక అరోరా కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన శిల్ప ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినీ పరిశ్రమ బాగా మారిపోయింది. అప్పట్లో మాకు ప్రతిరోజూ నేర్చుకునే అవకాశం ఉండేది. నిర్మాతలు, దర్శకులు నటీనటులు యువనటులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ తోడుండేవారు. కానీ ఈ రోజు పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఒకరి గురించి మరొకరు పట్టించుకునే టైమ్ ఉండట్లేదు. ఒక సినిమా చేస్తూనే మరో అవకాశం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను మళ్లీ అరంగేట్రం చేయాల్సి వస్తే అంత సులభంగా పని దొరుకుతుందని అనుకోవట్లేదు. 90వ శకంలో నేను లావుగా ఉన్నాననే కారణంగా ఎలాంటి పేర్లతో పిలిచారో ఆ దేవునికే తెలుసు. 1998లో వచ్చిన 'దిల్ సే' సినిమాలో 'చయ్య చయ్య' సాంగ్‌లో నుంచి నన్ను తప్పించి మలైకను ఎంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. నిజంగా నేను సినిమాల్లో కొనసాగితే మలైకకు సినీ జీవితమే ఉండేది కాదు' అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంది.