Shilpa Shetty: పేద పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేస్తా.. బాలీవుడ్ నటి

by Nagaya |   ( Updated:2022-06-04 08:33:04.0  )
Shilpa Shetty
X

దిశ, సినిమా: Shilpa shetty Sponsors education of 'Dance deewane juniors' contestants| బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతిభావంతులైన పిల్లలను చదివించేందుకు తన వంతు ఆర్థిక సాయం చేస్తానంటోంది. తాజాగా 'డ్యాన్స్ దివానే జూనియర్స్' రియాలిటీ షో స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఆమె.. సెట్స్‌లో కంటెస్టెంట్స్‌తో గ్రూప్‌ డ్యాన్స్‌తో అలరించింది. ఈ క్రమంలోనే 'డ్యాన్స్ దివానే జూనియర్స్' పోటీదారు 10 ఏళ్ల ప్రియాన్షి కనార్జీ కుటుంబం ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తల్లి వైద్య ఖర్చులు కూడా పెరగడంతో చదువును కొనసాగించలేకపోతున్నానని భావోద్వేగానికి లోనైంది. దీంతో ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న శిల్పాశెట్టి.. తన ఎడ్యుకేషన్‌కు సరిపడా డబ్బులు స్పాన్సర్ చేస్తానని మాటిచ్చింది. 'పిల్లలే మన భవిష్యత్తు. ప్రతి బిడ్డ విద్యను కొనసాగించడం చాలా ముఖ్యం. చదువు అనేది ప్రతివ్యక్తి జీవితానికి గొప్ప పునాది. సొంత కాళ్లపై నిలబడేందుకు విద్య చాలా ముఖ్యం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లలు, తల్లిదండ్రులందరికీ ఈ విషయం చెబుతున్నా. బాలలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రియాన్షి భవిష్యత్తులో మంచి గురువు అవుతుందని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story