- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరూ చూస్తుండగానే శేఖర్ మాస్టర్‌కి శ్రీముఖి ముద్దులు.. ఇంటికెళ్లిన వెంటనే వైరల్ ఫీవర్
దిశ, సినిమా: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తెలుగు, కన్నడ, హిందీ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అంతేకాకుండా పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే అడపాదడపా స్కిట్లు కూడా వేసి జనాలను నవ్విస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అని వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో శ్రీముఖితో కలిసి శేఖర్ మాస్టర్ ఓ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షోలో భాగంగా ఆమె ముద్దు కూడా పెట్టింది. అప్పట్లో అది పెద్ద సెన్సేషనల్ అయింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ గతంలో జరిగింది గుర్తు చేసుకుని అసలు విషయాలు తెలిపారు. ‘‘ఢీ, జబర్దస్త్, కామెడీ స్టార్స్ వంటి షోలలో డాన్సులు చేస్తుంటే బాగా అరిచే వాళ్లు. అనసూయ, రష్మితో ఏదైనా మాట్లాడినా డాన్స్ చేసినా అక్కడున్న వారు గోల పెట్టేవారు. ఏదో నాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని పడి చస్తారనేలా క్రియేట్ చేశారు. కానీ అదంతా షోలో కమెడియన్స్ చేసి రూమర్ మాత్రమే అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే శ్రీముఖి ఓ షోలో ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దు పెట్టినట్టు సరదాగా చేసింది. ఆమె చేసిన దానికి నేనేం చేస్తా.
ఆ షో తర్వాత ఏదేదో అల్లేసి వార్తలు రాశారు. కానీ అది జస్ట్ ఫస్ కోసం మాత్రమే చేసింది. అయితే కామెడీ స్టార్స్‌లో కూడా ఓసారి ఆ ముద్దు గురించి ప్రస్తావన వచ్చింది. నేను పట్టించుకోనట్టుగా ఉన్నాను. షూట్ అయ్యాక ఎందుకో తెలియదు కానీ నాకు ఇంటికి వెళ్లిన వెంటనే వైరల్ ఫీవర్ వచ్చింది. అసలు నాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉండదు. ప్రేక్షకులను అలరించడానికే అలా చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Read More..
అది గిఫ్ట్‌గా ఇచ్చి నన్ను మీ సొంతం చేసుకోండి.. అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్!