- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెట్లోనే ఏడ్చేసిన శేఖర్ మాస్టార్.. ఆసిఫ్ అలా అనడంతో..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి శేఖర్ మాస్టార్. అటూ సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలతో స్టెప్పులు వేయిస్తూనే.. ఇటూ బుల్లితెరపై పలు షోలో జడ్జ్‌గా దూసుకుపోతున్నారు. అయితే.. షోలో ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే శేఖర్ మాస్టార్ ఎమోషనలై ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 'డ్యాన్స్ ఐకాన్' ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఆసిఫ్ అనే కంటెస్టెంట్ 'ఆశాపాశం' అనే సాంగ్‌కు ఫెర్మార్మెన్స్ చేశాడు. అది అక్కడ ఉన్నవాళ్లందరిని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆసిఫ్ వాళ్ల నాన్నను హోస్ట్‌గా వ్యవహారిస్తున్న ఓంకార్ స్టేజ్‌పైకి పిలిపించారు. వాళ్ల నాన్న స్టేజ్‌పైకి రాగానే.. ''నాన్న ఒక్కసారి నిన్ను హగ్ చేసుకోనా'' అని అడగటంతో అక్కడున్న వాళ్ల అందరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు . శేఖర్ మాస్టార్ కూడా వాళ్ల నాన్నను గుర్తు చేసుకుని ఎంతో బాధపడతారు. ఆయన నోటి వెంట మాటా కూడా పెగలలేదు. స్టేజీ మీదనే కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రోమో వీడియో వైరల్ కాగా.. ఇది చూసిన వాళ్లు కూడా ఎమోషనల్‌కు గురవుతున్నారు.