మద్యం మత్తులో షెహనాజ్ వింత ప్రవర్తన.. తెల్లారేదాక క్లబ్‌లోనే తాగుతూ

by sudharani |   ( Updated:2023-09-13 14:18:29.0  )
మద్యం మత్తులో షెహనాజ్ వింత ప్రవర్తన.. తెల్లారేదాక క్లబ్‌లోనే తాగుతూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ మద్యం మత్తులో అడ్డంగా బుక్కైంది. ‘థాంక్యూ ఫర్ కమింగ్‌’ సినిమాతో అక్టోబరు 6న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఆమె ఈ మూవీని తెగ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ పార్టీకి హాజరైన నటి అక్కడ ఫ్రెండ్స్, సహనటులతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే ఈవెంట్‌లో ఓవర్‌గా డ్రింక్ చేసినట్లు తెలుస్తుండగా క్లబ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆమె నడవలేకపోయింది.

దీంతో తన సోదరుడు షాబాజ్ షెహనాజ్ చేతు పట్టుకుని దగ్గరుండి కారులో ఎక్కించాడు. అయితే ఈ తతంగం మొత్తం రాత్రి 4 గంటల సమయంలో అక్కడున్న ఫొటో గ్రాఫర్లు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతుంది. ‘షెహనాజ్ తాగుబోతుగా మారింది. స్టార్ డమ్ రాకముందే చాలా ఓవర్‌ చేస్తుంది. డ్రింక్ మాస్టర్’ అంటూ నెటిజన్లు నెగెటీవ్ కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు.

Advertisement

Next Story