రక్షితారెడ్డితో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

by Hamsa |   ( Updated:2023-01-26 14:17:18.0  )
రక్షితారెడ్డితో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం శర్వానంద్‌, రక్షితారెడ్డిల నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు శర్వా సన్నిహితుడు రామ్‌చరణ్ దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక రక్షిత రెడ్డి తండ్రి మధుసూధన్ రెడ్డి హైకోర్టు న్యాయవాది. అలాగే రక్షిత టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డి‌కి మేనకోడలు. మొత్తానికి రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి శర్వానంద్ అల్లుడు కాబోతున్నాడు. అయితే ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా జరిగినప్పటికీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. కాగా పెళ్లి డేట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Advertisement

Next Story