కాలేజీ కుర్రాడితో షనయా డేటింగ్.. ఒకే యూనివర్సిటీలో ఉంటూ

by Prasanna |   ( Updated:2023-01-09 09:48:28.0  )
కాలేజీ కుర్రాడితో షనయా డేటింగ్.. ఒకే యూనివర్సిటీలో ఉంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ షనయా కపూర్ డేటింగ్‌ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సినిమా అరంగేట్రం చేయకముందే సోషల్ మీడియా వేదికగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్నది.. ఇటీవలే ఓ కుర్రాడి మాయలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన కాలేజ్ మేట్‌ కరణ్ కొఠారీ అనే 23 ఏళ్ల యువకుడుతో ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుండగా వీరిద్దరూ కలిసి తమ పైచదువుల కోసం లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్సిటీలో జాయిన్ అయినట్లు సమాచారం. ఇక కొఠారీకి కూడా పరిశ్రమకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ ఉందని, త్వరలోనే తమ డేటింగ్ వార్తను ప్రకటించబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుంటే.. షనయ 'బేధడక్‌'తో తెరంగేట్రం చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Also Read... నేను పోటీలో ఉంటే మలైక కెరీర్ క్లోజ్ అయ్యేది: శిల్ప

Advertisement

Next Story