డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి సోదరి..

by Hamsa |   ( Updated:2023-02-01 13:34:29.0  )
డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి సోదరి..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి 'పిలిస్తే పలుకుతా' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే పలు చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవల షమితా శెట్టి, బాలీవుడ్ నటుడు ఓ వీడియోలో పట్టుకుని నడవడంతో.. అమీర్ అలీతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా, రూమర్స్‌పై షమితా ట్విట్టర్ ద్వారా నెటిజన్లపై ఫైర్ అయ్యింది. ''సమాజంలో ఇలాంటి మనస్తతత్వంతో నేను అయోమయంలో ఉన్నాను. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తారు. ఇది నెటిజన్లు భావనలకు నిదర్శనం. అందుకే నేను నోరు విప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నా. వీటిపై కాకుండా ఈ దేశంలోని మరిన్ని ముఖ్యమౌన సమస్యలపై దృష్టి పెట్టండి'' అంటూ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story