అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్నా.. బట్టలు అలా మార్చుకునేదాన్నంటూ షాలిని పాండే ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |
అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్నా.. బట్టలు అలా మార్చుకునేదాన్నంటూ షాలిని పాండే ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షాలిని విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇటీవల హిందీలో మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక టాలీవుడ్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాకే పరిమితం అయింది. తాజాగా, షాలిని పాండే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా ఇండస్ట్రీకి రాకముందు తన లైఫ్ ఎలా ఉందో వివరించి షాకిచ్చింది. ‘‘ మా నాన్నకు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు. అందుకే ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేయాలని చెప్పేవారు. కానీ నాకు మాత్రం ఎలాగైనా సినిమాల్లోకి రావాలని ఉండేది.

అందుకే మధ్యలోనే చదువు మానేసి ముంబైకి పారిపోయి వచ్చేశాను. అక్కడ నా ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్నాను. అక్కడ నచ్చకపోవడంతో.. మగవాళ్లతో రూమ్ షేర్ చేసుకున్నాను. అయినా నేను భయపడకుండా వారితో ఉన్నాను. అసలు బట్టలు మార్చుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. అయినా చాటుగా బట్టలు మార్చుకునేదాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడకుండా ధైర్యంగా వారితోనే ఉన్నాను. అలా సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో నాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీలో చాన్స్ ఇచ్చారు. నేను చేసిన ఫస్ట్ సినిమా అయినప్పటికీ భారీ విజయం సాధించి నాకు పాపులారిటీ వచ్చేలా చేసింది. అయితే ఇందులో విజయ్ దేవరకొండ సరసన నాకు చాన్స్ రావడమే నా అదృష్టంగా భావించాను. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అంత గుర్తింపు తెచ్చుకోవడంతో నా ఫ్యామిలీ చూసి నాకు సపోర్ట్‌గా నిలిచారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed