'మీ ఆస్కార్ అవార్డు‌ను ఒక్కసారి తాకనివ్వండి'..RRR టీమ్‌కు Shah Rukh Khan!

by Hajipasha |   ( Updated:2023-01-21 14:28:26.0  )
మీ ఆస్కార్ అవార్డు‌ను ఒక్కసారి తాకనివ్వండి..RRR టీమ్‌కు Shah Rukh Khan!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' ట్రైలర్ మంగళవారం విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. ఇదిలావుంటే.. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీని ప్రమోట్ చేస్తున్న చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ షారుక్ ఓ ట్వీట్ చేశాడు. మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ తన సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం టైమ్ కేటాయించిన చరణ్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ.. 'మీ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్ అవార్డు‌ను ఇంటికి తెచ్చినప్పుడు నన్ను ఒక్కసారి తాకనివ్వండి' అంటూ ట్వీట్టర్ వేదికగా థాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : 2023 ఏడాది IMDbలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాలు ఇవే!

Advertisement

Next Story